ఘనంగా మలిశెట్టి వెంకటరమణ జన్మదిన వేడుకలు

రాజంపేట నియోజకవర్గం: రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ జన్మదిన వేడుకలను శనివారం సిద్ధవటం మండల పరిధిలోని ఉప్పరపల్లి గ్రామంలో జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకలలో భాగంగా కేకు కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. మలిశెట్టి వెంకటరమణ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని రాజకీయాల్లో అంచలంచలుగా ఎదిగి మంచి పదవులను పొందాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.