ఏపీకి అదనపు రుణంకు కేంద్రం అనుమతి

కేంద్రం నుంచి ఏపీకి మరో గుడ్ న్యూస్ అందింది. 2 వేల 300 కోట్లకు పైగా అదనపు ఋణం తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ కాసేపటి క్రితం ఉత్తరువులు జారీ చేసింది.

ఏపీ ప్రభుత్వం కరోనా పరిస్థితుల కారణంగా ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొంటుంది. ఈ సమయంలో కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వంకు గుడ్‌ న్యూస్‌ అందింది. ప్రతి ఏడాది రాష్ట్రాలు తీసుకునే అప్పుల విషయంలో లిమిట్‌ ఉంటుంది. అయితే ఈసారి కేంద్ర ప్రభుత్వం ఏపీకి కాస్త సడలింపు ఇచ్చింది. కరోనా పరిస్థితులు మరియు ఒకే దేశం ఒకే రేషన్‌ విధానంను సమగ్రంగా అమలు చేస్తున్నందుకు గాను ఏపీకి 2,525 కోట్ల అప్పు తీసుకునేలా అనుమతులు ఇచ్చింది.

దేశంలో ఏపీ మరియు యూపీకి మాత్రమే ఈ అనుమతిని కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఉత్తర ప్రదేశ్‌ కు కేంద్రం 4831 కోట్లు తీసుకునే వెసులు బాటు కల్పించింది. ఈ రెండు రాష్ట్రాలు కూడా ఒకే రేషన్‌ విధానంను సమగ్రంగా అమలు చేస్తున్నట్లుగా కేంద్రం పేర్కొంది. కేంద్రం ఇచ్చిన ఈ అనుమతితో ఏపీకి అదనపు అప్పు లభించబోతుందని ప్రభుత్వ వర్గాల వారు తెలియజేశారు.