కరాటేలో విద్యార్ధుల ప్రతిభకు ప్రశంసాపత్రాలు

  • కరాటే శిక్షణ తీసుకున్న విద్యార్థులకి సర్టిఫికెట్ లు అందజేసిన జనసేన రాష్ట్ర బీసీ నాయకుడు మరియు న్యాయవాది ఎం హనుమన్

విజయవాడ, పాయకాపురం ఎస్.జి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు కరాటే బెల్ట్ టెస్ట్ మరియు సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా కరాటే శిక్షణ తీసుకున్న విద్యార్థులకి సర్టిఫికెట్ లు అందజేడం జరిగింది. ఆత్మ రక్షణ విద్య మహిళలకు ఈ రోజుల్లో చాలా ముఖ్యమని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఆత్మ రక్షణ విద్య నేర్చుకోవాలని, ఆత్మరక్షణ మార్షల్ ఆర్ట్స్ విద్య మన ప్రాచీన విద్య, మన ప్రాచీన కళను మనం గుర్తించి ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ నిర్వహించిన ఎస్.జి స్కూల్ ప్రిన్సిపల్ అండ్ మేనేజ్మెంట్ కు మరియు ఒకినావాన్ గోజు రుయు కరాటే స్కూల్ అఫ్ ఇండియా, కృష్ణా డిస్ట్రిక్ట్ చీఫ్ కె. ప్రసాద్ కు ధన్యవాదాలు తెలియజేశారు. క్రౌ మగ సెల్ఫ్ డిఫెన్స్ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొదటిసారి తీసుకొచ్చింది హనుమాన్ అండ్ దేర్ టీం. చదువుతోపాటు ప్రతి మహిళకు ఆత్మ రక్షణ విద్య కరాటే ఎంతో అవసరమని ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడులు, హత్యాయత్నలను ఎదుర్కొనేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి శిక్షణకూ తల్లిదండ్రులందరూ తమ పిల్లలను క్లాసులకి పంపించి వారిని ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాం. కరాటే అంటే ఒక సర్టిఫికెట్స్ నిమిత్తం నేర్చుకొనే విద్య మాత్రమే కాదు, కరాటే ను స్పోర్ట్స్ కోటాలో చేర్చబడింది. గవర్నమెంట్ ఎగ్జామ్స్ నందు కూడా దీనికి రిజర్వేషన్ అనేది కల్పించారు. కరాటే ఒలంపిక్స్ లో ఉండడం కూడా మనకు గర్వకారణం. గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో కూడా దీనికి రిజర్వేషన్ అనేది కల్పించారు, కరాటే మన ఒలంపిక్స్ లో ఉండడం కూడా మనకు గర్వకారణం. ఆత్మ రక్షణకు, చురుకుతనానికి, స్పోర్ట్స్ కోటలో ఉద్యోగాలను సంపాదించడానికి అన్నిటికీ ఈ కరాటే అనేది చాలా ఉపయోగపడుతుందని, కాబట్టి కరాటే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిందిగా హనుమన్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *