జనసైనికుడినై పనిచేస్తా: గురాన అయ్యలు

  • ఆయ్యలు కు భారీ స్వాగతం పలికిన వీరమహిళలు, జనసైనుకులు, నాయకులు
  • అడుగడుగునా హారతులు, పూలమాలలతో.. జననీరాజనాలతో భారీ ర్యాలీతో స్వాగతం
  • జనహితమే జనసేనమతమని ఆయ్యలు వెల్లడి

విజయనగరం: ప్రముఖ యువనాయకుడు, వ్యాపార వేత్త, సంఘసేవకుడు గురాన అయ్యలు ఆదివారం నాడు మంగళగిరిలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలోచేరి, సోమవారం ఉదయం విజయనగరం కు చేరుకున్నారు. ఈ సందర్భంగా గురాన ఆయ్యలు విజయనగరం, వి.టి.అగ్రహారం వై జంక్షన్ కూడలికి రాగానే భారీగా చేరుకున్న జనసేన నాయకులు, జనసైనుకులు, వీర మహిళలు, హారతులు సమర్పించి, పూలమాలలతో సత్కరించి భారీగా స్వాగతం పలికారు. అక్కడే ఉన్న హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, జనసైనికులు, నాయకులు, అభిమానులు అయ్యలును జనసేన ప్రచార రథంపై ర్యాలీగా వై జంక్షన్ నుండి ఎత్తు బ్రిడ్జి మీదుగా..వయా రైల్వే స్టేషన్, ఎన్.సి.ఎస్.రోడ్ మీదుగా, కన్యకా పరమేశ్వరీ కోవెల, వయా గంటస్తంభం, శ్రీ పైడి తల్లి అమ్మవారి కోవెలవద్దకు రాగానే పైడితల్లి అమ్మవారి కోవెలలో సతీసమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవెల ప్రధాన అర్చకులు సంప్రదాయ పద్ధతిలో తీర్థప్రాసాదాలతో ఆశీర్వదించారు. అనంతరం కోట మీదుగా అంబేత్కర్ జంక్షన్ వద్దకు రాగానే అంబేత్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ నుండి అర్.టి.సి. కాప్లెక్స్ వద్దనున్న గురాన అయ్యలు హోటల్ జి.ఎస్.అర్. ఇంటర్నేషనల్ వద్ద ర్యాలీ ముగిసిసింది. ర్యాలీలో ప్రతీ కూడళ్లలో అడుగడుగునా హారతులు సమర్పించి పూలమాలలతో సత్కరించి అభిమానులంతా పవన్ కళ్యాణ్ నాయకత్వం వర్ధిల్లాలి, గురాన అయ్యలు నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేస్తూ గురాన ఆయ్యలుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. తల్లి ఆశీస్సులు: ర్యాలీలో భాగంగా కన్యకాపరమేశ్వరీ రహదారిలో అయ్యలు స్థానికప్రాంతమైన మంగలవీధి కు వచ్చేసరికి తన తల్లి గురాన అప్పలనర్సమ్మ, వారి కుటుంసభ్యులు అయ్యలుకు స్వాగతం పలకడానికి రాగా, వెను వెంటనే ప్రచారరథం దిగి తల్లి కాళ్ళకు నమస్కరించి ఆశీస్సులు పొందారు. ర్యాలీ ముగిసిన అనంతరం ముగింపు కార్యక్రమంలో భాగంగా హోటల్ జి.ఎస్.అర్. ఇంటర్నేషనల్ లో అయ్యలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు గురాన అయ్యలు మాట్లాడుతూ జనహితమే జనసేన మతమని, రాష్ట్రంలో ప్రజలు బాగుండాలని, తన బంగారంలాంటి భవిష్యత్తును త్యాగం చేసి, తన కష్టార్జితాన్ని పేదలకు, ప్రజలకు సహాయం చేస్తున్న నిస్వార్థ పరులు పవన్ కళ్యాణ్ అని, ముందునుండి ఓ అభిమానిగా ఆయన భావజాలాన్ని తెలిసిన వాడినని, పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, ముందునుండి పార్టీలో పనిచేస్తున్న వారితో కలుపుకొని జెండా మోస్తూ జనసైనుకుడుగా పార్టీ బలోపేతానికి పనిచేస్తూ, ప్రజా సమస్యలపై దృష్టి సాధిస్తానని వెల్లడించారు. సుమారు ఐదువందల దిచక్ర వాహనాలు, ఇరువై కార్లతో భారీగా సాగిన ఈ ర్యాలీలో భారీగా జనసైనుకులు, వీరమహిళలు, విజయనగరం జిల్లా మండల అధ్యక్షలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాలుగున్నారు.