కొండయ్య పాలెంలో స్కాముపై చైతన్య యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ సూచనలతో స్కాముపై చైతన్యం కార్యక్రమం జిల్లా సమ్యుక్త కార్యదర్శి బడే క్రిష్ణ ఆధ్వర్యంలో గురువారం 17వ డివిజన్ జగన్నాధపురం చర్చ్ స్క్వేర్ ప్రాంతంలోను మరియు తోట కుమార్ ఆధ్వర్యంలో కొండయ్య పాలెం మిలిటరీ రోడ్డు నాలుగు రోడ్డు జంక్షన్ దగ్గర ప్రాంతంలోను నిర్వహించడం జరిగింది. ఈ సంధర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన పార్టీ పి.ఏ.సి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు రోజుకొకటి బట్టబయలు చేస్తున్న ప్రభుత్వ అవినీతిలను తాము నాదెండ్లగారు మాట కాకినాడలో అందరినోట అనే నినాదంతో ప్రతిరోజూ చైతన్య యాత్రని చేస్తున్నామన్నారు. ప్రజలందరూ కలిసి తమ జీవనవిధానం సక్రమంగా జరగాలన్న ఉద్దేశంతో ఒక యంత్రాంగాన్ని ఎన్నుకోడం జరుగుతుందనీ దాన్నే నేటి సమాజంలో ప్రభుత్వం అంటారన్నారు. మరి అలాంటి ఉద్దేశంతో ఎన్నుకున్న నేటి ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని చూసి ఎన్నుకున్న ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు. పాలనానుభవం లేక తప్పొప్పులు జరిగితే సరేలే మనఖర్మ అనుకోవచ్చుగానీ మరీ బరితెగించేసి అవినీతికి పాల్పడుతున్న ఈ వై.సి.పి ప్రభుత్వాన్ని చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని విమర్శించారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అన్నట్టు ప్రజా ప్రతినిధులే అవినీతికి పాల్పడితే ఇంక అధికారులు ఎందుకు మడికట్టుకుని కూర్చుంటారని ప్రశ్నించారు. అందుకే హలో ఏపి.. బై బై వై.సి.పి అని ప్రజలే చెపుతున్నారన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర సమ్యుక్త కార్యదర్శి వాశిరెడ్డి శివ, ముల్లేటి లోక భగవాన్, అగ్రహారపు సతీష్, నాగిరెడ్డి నగేష్, తుమ్మలపల్లి సీతారాం దేవ్, మల్లేశ్వరరావు, అడప కుమార్, బొంతు సురేష్ బాబు, గంటిమి దుర్గాప్రసాద్, ముమ్మిడి పండు, గంటి మీ వాసు, అంజి, అడబాల వీరబాబు, పసుపులేటి వీరేంద్ర, పినిశెట్టి సురేష్, పొట్లూరి అక్ష్యయ దుర్గా ప్రసాద్, గంపల ప్రసాద్, బస్వాని నాగబాబు, చోడిపల్లి సత్యవతి, వరిపల్లి ప్రసాద్, పాలెపు వీరబాబు తదితరులు పాల్గొన్నారు.