వైసిపి నిర్లక్ష్యం వలన రాచుపూడి ఆదిత్య ప్రాణం బలి: కనపర్తి మనోజ్

ప్రకాశం జిల్లా, కొండపి నియోజకవర్గం, టంగుటూరు మండలం, సూరారెడ్డిపాలెం పంచాయతీలో జరిగిన అవినీతిని జనసేన పార్టీ నాయకులు వెలుగులోకి తీసుకుని వచ్చారు. 25 సంవత్సరాల కాలం నాటి మంచినీటి నేలబావి ప్రజలకు ప్రమాదకరంగా ఉంది, గ్రామస్తులు ఎన్నోసార్లు అధికారులు దృష్టికి నాయకుల దృష్టికి తీసుకువచ్చిన నిర్లక్ష్యంగా పట్టీపట్టనట్లుగా వ్యవహరించారు. ఇటీవల కాలంలో రాచుపూడి ఆదిత్య ప్రమాదవశాత్తు జారిపడి బావిలో పడటం వల్ల ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజుకి కూడా అధికారులు ఆ బావిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా సూరారెడ్డిపాలెంలో జగనన్న కాలనీలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చి, ఇసుక వాటర్ పైపులైన్లు రోడ్ల పేరుతో లక్షల్లో వైసిపి నాయకులు అవినీతి చేసి దోచుకున్నారు. ఇల్లు లేని నిరుపేదలకు ఇప్పటివరకు ఒక్క ఇల్లు కూడా కట్టించకుండా అమాయకులను మోసం చేశారు. ఈరోజు ఆ జగనన్న కాలనీలో పచ్చని చిల్లచెట్లతో నిండి ఉంది, ఇప్పటికైనా అధికారులు మరియు వైసిపి నాయకులు మేలుకొని ప్రమాదకరంగా ఉన్న నేలబావిని ఇనుప జల్లేడుతో బిగించి ప్రజలకు ప్రమాదం జరగకుండా చూడాలి. రోడ్డు వెడల్పులో భాగంగా స్కూళ్లని పడవేసి ఇప్పటివరకు మరల నిర్మించలేదు, విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న వైసిపి ప్రభుత్వం ఇల్లులేని నిరుపేదలకు ఇల్లు కట్టించాలని కొండపి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు మండలం జనసేన పార్టీ నాయకులు అత్యాల సురేష్ బాబు (ప్రధాన కార్యదర్శి), వరికూటి చిరంజీవి (కార్యదర్శి), సనగర రాజేష్ (ప్రధాన కార్యదర్శి), రాచూరి అవినాష్, పాలపర్తి వేణు, దేవరపల్లి రోశయ్య, చాట్ల అజయ్ బాబు, ఇత్తడి కోటయ్య, సలగాల సుధాకర్, మెత్తార్ల శేఖర్, గర్నెపూడి కిషోర్, అత్యాల సుమంత్, అత్యాల బుజ్జి మొదలైన టంగుటూరు సూరారెడ్డిపాలెం జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.