ఛలో మచిలీపట్నం.. జనసేన ఆవిర్భావ సభకు తరలిరండి: గునుకుల కిషోర్

  • అంతంత మాత్రం ఓట్లతో, సానుభూతితో బయటపడి గెలుపొందిన వైసిపీ నాయకులారా ఇక సర్దుకోండి, ఇంటికెళ్ళేందుకు సిధ్ధం అవండి

నెల్లూరు: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు మీ మాటలు, మీ ప్రవర్తన అందరూ గమనించారు అంటూ జనసేన నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆధ్వర్యంలో శనివారం గాంధీ బొమ్మ వద్ద పోస్టర్ లాంచ్ చేసారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జనసేన 10 వ ఆవిర్భావ సభ అంగరంగ వైభవంగా మచిలీపట్నంలో ఈ నెల 14 న జరగనున్నది. లక్షలాది మంది కార్య కర్తలతో జాతరలా జరగనున్న జనసేన పండుగకు జిల్లా వ్యాప్తంగా జనసేన నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పార్టీ మద్దతుదారులు మెగా అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలి. స్థానిక రైతులు స్వచ్ఛందంగా ఇచ్చిన పొలాల్లో భారీ ఏర్పాట్ల తో జరగనున్న ఈ వేడుకల్లో అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రానున్న సార్వత్రిక ఎన్నికల దిశా నిర్దేశం చేస్తారు. అంతంత మాత్రం ఓట్లతో, సానుభూతి తో బయటపడి గెలుపొందిన వైసిపీ నాయకులారా జాగ్రత్త.. ఈసారి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలతో పాటు మీ మాటలు, మీ ప్రవర్తన అందరూ గమనించారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతారు.2014,2019 ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ప్రజా శ్రేయస్సు కోసం ఏవైతే పిలుపునిచ్చారో వాటికి మద్దతుగా ప్రజలు నిలిచారు. రేపటి సంవత్సరం సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ నిర్ణయమేదైనా మేమంతా కట్టుబడిఉన్నాం. ప్రజా ప్రభుత్వం జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పరిచేందుకు ఆయన నిర్ణయం ఏదైనా కూడా దానిని పాటించేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాము. ఆలోచించే ప్రశ్నే లేదు ఈ సారి వై సి పీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గునుకుల కిషోర్ తో ప్రశాంత్ గౌడ్, కంతర్, షాజహాన్, అలేఖ, హేమచంద్ర యాదవ్, శరవణ, మౌనేష్, కళాయి చిన్నరాజ, ప్రసన్న, వెంకీ, పవన్ కళ్యాణ్, సాయి తదితరులు పాల్గొన్నారు.