గల్ఫ్ లో జనసేన సమావేశానికి నాదెండ్ల ను ఆహ్వానించిన చందక రామదాస్

హైదరాబాద్: గల్ఫ్ సేన నాయకులు, చిరు మెగా యూత్ ఫోర్స్ అధ్యక్షుడు రామదాస్ చందక జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను వారి నివాసంలో కలిసి, ఆరు గల్ఫ్ దేశాల ఐక్య వేదిక “గల్ఫ్ సేన” త్వరలో నిర్వహించబోయే కీలక సమావేశానికి దుబాయ్ కు రావాలని జనసేన ముఖ్య నాయకులు మనోహర్ కు ఆహ్వానం పలికారు. దానికి మనోహర్ సానుకూలంగా స్పందించి… మీరు ఏ పని చేసినా అది జనసేన పార్టీ బలోపేతం దిశగా ఉండాలని, ఖర్చు పెట్టే ప్రతి పైసా పార్టీ అభివృద్ధికి ఉపయోగకరంగా ఉండాలని సూచించడం జరిగింది. గత నాలుగేళ్లుగా పార్టీ తరపున సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, కతర్, బహరైన్, యూఏఈ ల ఐక్య వేదిక అయిన “గల్ఫ్ సేన” చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించి, గల్ఫ్ సేన బృందానికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా చందక రాందాస్ మాట్లాడుతూ త్వరలో దుబాయ్ లో జరగబోయే కార్యక్రమంలో గల్ఫ్ లోని ముఖ్య నాయకులను కలసి, గల్ఫ్ సేనకు దిశానిర్దేశాలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలియజేస్తామని చెప్పడం జరిగింది. మన అందరి ప్రయత్నం జనసేనానిని ముఖ్యమంత్రిగా చూడటం, తద్వారా రాష్ట్ర అభివృద్దే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేస్తామని, వ్యక్తిగత విభేదాలు పక్కన పెట్టి, మరింత పటిష్టంగా పార్టీ అభివృద్ధికి పాటుపడుతామని చెప్పడం జరిగింది. రానున్న రోజుల్లో గల్ఫ్ సేన ఇచ్చే ప్రతి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటామని మనోహర్ హామీ ఇచ్చారని, సుమారు నలబై నిమిషాలు తమ విలువైన సమయాన్ని కేటాయించి, గల్ఫ్ సేన సభ్యులతో.. ఆరు దేశాల వివరాలు తెలుసుకోవడం చూస్తే.. నాదెండ్ల మనోహర్ నిబద్ధత కు తార్కాణంగా చెప్పుకోవచ్చని రాందాస్ చందక, మనోహర్ కు ధన్యవాదాలు తెలిపారు.