చంద్రగిరి నియోజకవర్గ పాయిట్ ఆఫ్ కాంటాక్ట్ గా దేవర మనోహర్

చంద్రగిరి, జనసేన జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ కు జనసేన-టిడిపి కు సమన్వయ బాధ్యతలు అప్పగించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం యర్రావారిపాలెం మండలానికి చెందిన మనోహర్ ను చంద్రగిరి నియోజకవర్గ జనసేన సమన్వయ బాధ్యుడుగా నియమించారు. అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు ఇసుక మట్టి భూదందలపై ఆయన పోరాటం చేయటమే కాకుండా జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా ఇల్లు కోల్పోయిన వారికి ప్రభుత్వంతో పోరాడి న్యాయం చేస్తూ పార్టీని ప్రజలలోకి తీసుకెళ్లారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన పరితీరును గుర్తించి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు చంద్రగిరి నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గ జనసేన-టిడిపి సమన్వయ బాధ్యుడుగా చంద్రగిరి నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ గా దేవర మనోహర్ నియామకం జనసేన పార్టీ అధిష్టానం ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ సందర్భంగా దేవర మనోహర్ మాట్లాడుతూ ఈ పదవి రావడానికి కృషి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఏసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరి ప్రసాద్ లకు మరియు పార్టీ పెద్దలకు, తనతో కలిసి నడిచిన ప్రతి జనసేన నాయకులకు, వీర మహిళలకి, జనసైనికులకు దేవర మనోహర్ కృతజ్ఞతలు తెలిపారు.