రాయల్ సోల్జర్స్ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదానం

గుంటూరు, ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన స్వర్గీయ డొక్కా సీతమ్మ వర్ధంతి పురస్కరించుకుని జేఎస్పి రాయల్ సోల్జర్స్ ఆధ్వర్యంలో గుంటూరు, రెడ్డిపాలెం లోని మానవతా సేవా సమితి వృద్ధాశ్రమంలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అన్నదాసు వెంకట సుబ్బారావు, ఇక్కుర్తి శ్రీనివాసరావు, చుండూరు శివరామ కృష్ణ, సూదా నాగరాజు, బొడ్డుపల్లి రాధా కృష్ణ తదితరులు పాల్గొన్నారు.