ముఖ్యమంత్రి జగన్ క్షమాపణ చెప్పాలి: పడాల అరుణ

గజపతినగరం, ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా శుక్రవారం మాజీ మంత్రి వర్యులు శ్రీమతి పడాల అరుణ ప్రెస్ మీట్ పెట్టి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వీర మహిళలకు ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ క్షమాపణ చెప్పాలని కోరారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు నిరసనలు తెలియజేస్తాం అని చెప్పారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం మండలాధ్యక్షులు మునకాల జగన్నాధరావు, దత్తిరాజేరు మండల అధ్యక్షుడు చప్పా అప్పారావు, కొమరాడ మండల అధ్యక్షుడు శ్రీకర్, జిల్లా కార్యనిర్వాహక కమిటి సభ్యుడు మామిడి దుర్గాప్రసాద్, పడాల శరత్, నేతేటి రామచంద్రన్ తదితరులు పాల్గొన్నారు.