బిక్కవోలు మండలంలో ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

అనపర్తి నియోజకవర్గం: పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా మంగళవారం అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, ఆరిక రేవు గ్రామంలో మెగా డిజిటల్ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 200 మొక్కలు నాటడం జరిగింది. అనంతరం కేక్ కటింగ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు ఇండవీరబాబు, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డి శ్రీనివాసరావు, మెగా అభిమానులు కొర్ల నాగు, కొర్ల బ్రహ్మన్న, అబ్బిరెడ్డి సత్తిబాబు, గరక సత్తిబాబు, మైపాల్ సుబ్బన్న కాపు, వలవల నరసయ్య, సత్యం శెట్టి వీరార్జన్, వినయ్, పండు, కొర్ల మణికంఠ, మెగా అభిమానులు పాల్గొన్నారు.