“”మెగా యువరాణి” రాకతో వేడుకలు నిర్వహించిన విజయనగరం జిల్లా చిరంజీవి యువత

విజయనగరం: మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉపాసన దంపతులకు మెగా ప్రిన్సెస్ ను జన్మనివ్వడంతో అభిమానుల్లో ఆనందోత్సవాలకు అవదెల్లేకుండా ప్రపంచవ్యాప్తంగా మెగాభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత మరియు అంజనీ పుత్ర చిరంజీవి బ్లడ్ డోనర్స్ క్లబ్ అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో స్థానిక పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో జన్మనిచ్చిన తల్లి ఉపాసన, బిడ్డ యువరాణి, మెగా ఫ్యామిలీ కుటుంబసభ్యులు మరియు మెగాభిమానులు సంతోషంగా, ఆయురారగ్యాలతో ఉండాలని ప్రత్యేక తమలపాకు పూజలు నిర్వహించారు. అనంతరం వేడుకల్లో భాగంగా ముందుగా పంచముఖ ఆంజనేయస్వామి అన్నదాన ప్రధాన సేవకులు కామరాజు, సీనియర్ మెగాభిమాని కృష్ణారావు, జనసేన వీర మహిళ మాతా గాయత్రి కేక్ ను కట్ చేసి, భక్తులకు, అభిమానులు మిఠాయిలు పంచిపెట్టుకున్నారు.
కార్యక్రమంలో జిల్లా చిరంజీవి యువత మెగాభిమానులు, జనసేన యువ నాయకులు పిడుగు సతీష్, జిల్లా జనసేన మైనారిటీ యువ నాయకులు హుస్సేన్ ఖాన్, లాలిశెట్టి రవితేజ, లంకాపట్నం కుమార్, తోటపాలెం వాసు, గాజులరేగ వాసు, హరికృష్ణ, చందు, పైడిరాజు, అడబాల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.