కొవ్వూరు జనసేనలో భారీ చేరికలు

కొవ్వూరు నియోజకవర్గం: కొవ్వూరు మండలం, ఆరికరేవుల గ్రామంలో బుధవారం కొవ్వూరు జనసేన మండల అధ్యక్షులు సుంకర సత్తిబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జనసేన గ్రామ అధ్యక్షులు తుమ్మల శివగారి ఆధ్వర్యంలో ఇతర పార్టీల నుంచి 25 మంది జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు, ఆయన నీతీ నిజాయితీ, సమాజం పట్ల సాయం చేసే గుణం, ఆదర్శ భావాలు నచ్చి జనసేనలో చేరారు. వారికి జనసేన పార్టీ కండువాలు కప్పి, పవన్ కళ్యాణ్ గారి మనోగతం పుస్తకాలు ఇచ్చి, జనసేన సిద్దాంతంతో, ఆశయంతో పుట్టిన పార్టీ అని తెలియచేసి అందరిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎక్స్ ఎమ్మెల్యే టివి రామారావు, తాళ్లపూడి మండల అధ్యక్షులు గంటా కృష్ణ, చాగల్లు మండల అధ్యక్షులు ఉప్పులూరి చిరంజీవి, సీతంపేట జనసేన సర్పంచ్ జెట్టి బంగారయ్య, సీనియర్ నాయకులు కొప్పాక విజయ్ కుమార్, పెరుగు శివ, ఏడిద వీరరాఘవులు, గండ్రోతు పవన్, కల్లేపల్లి ప్రభాస్ ఇతర నాయకులు పాల్గొన్నారు.