చిరు సేవా సమితి ఆధ్వర్యంలో ఘనంగా చిరంజీవి పుట్టినరోజు వేడుకలు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, రాజోలు నియోజకవర్గంలో చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా సఖినేటిపల్లి మలికిపురం మండలాల సేవా సమితి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సేవా సమితి వారు, మలికిపురం మండల ఎంపీపీ, మండల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా నాయకులు, రాజోలు జనసేన నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.