సమస్యలన్ని పరిష్కరించాలని డిమాండ్ చేసిన పుంగనూరు జనసేన

పుంగనూరు, చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డా.పసుపులేటి హరిప్రసాద్ ఆదేశాల ప్రకారం పుంగనూరులో జిల్లా కార్యదర్శి పగడాల రమణ అధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి జిల్లా సమస్యలను పత్రికాముఖంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి వివరించడం జరిగినది. అదేవిధంగా సమస్యలు అన్ని పరిష్కరించాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు విరుపషి, మండల నాయకులు హరి నాయక్, మురళి, ఎం.సీన, బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు.