అనంతపురం జిల్లాలో అభద్రతాభావంతో సీఎం జగన్ ప్రసంగం

అనంతపురం జిల్లాలో సభ పెట్టి అసలు ఈ ఐదు సంవత్సరములలో అనంతపురం జిల్లాకు నేనేం చేశాను అనేది చెప్పలేకపోయారు. అనంతపురం జిల్లాలోని రైతులకు గాని దళితులకు కానీ మౌలిక వసతులు కల్మపనకు కానీ జిల్లా అభివృద్ధికి నేనిది చేశాను అని చెప్పలేక పోయారు. రాయలసీమలో వెనుకబడిన ప్రాంతమైనటువంటి అనంతపురంకు నేను ఈ విధంగా సహాయపడ్డాను అని చెప్పలేకపోయారు. జిల్లా కేంద్రంలో కనీసం సరైన రహదారులు లేవు, సంక్షేమ పధకాలను కనిపెట్టిన వ్యక్తిగా నేను సిఎం కాక ముందు సంక్షేమ పథకాలే లేవు అనేవిధంగా ఊహించుకుంటూ ఉన్నారు. తన పార్టీ కార్యకర్తలు తన వైపు లేరనే అనుమానం కలిగింది ఎందుకంటే పదేపదే నేనొక్కన్నే నాకెవరూ లేరు మీరే నాకు అంటూ అబద్ధపు మాటలను పలికి వారిని ఏ మార్చాలని అనుకున్నట్టు ఉన్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు మీ కార్యకర్తలకు కూడా తెలుసు మీకు తోడుగా ఇసుక మాఫియా చేసిన నాయకులు ఉన్నారని. లిక్కర్ మాఫియా చేసిన నాయకులు ఉన్నారని. ఆంధ్ర రాష్ట్ర యువతను గంజాయి వైపు మళ్ళించే నాయకులు ఉన్నారని. స్కూళ్లకు పార్టీ రంగులు వేసి వందల కోట్లు దోచుకున్న వారు ఉన్నారని. బియ్యం బస్తాలకు బ్యాగులు ఇస్తానని వందల కోట్లు దోచుకున్న వారు. ఉన్నారని మట్టి మాఫియా దోచుకున్న నాయకులు ఉన్నారని. సిమెంటు కంపెనీలు ఉన్నాయని వీటితోపాటు ప్రజల సొమ్మును అప్పనంగా తీసుకొని మీకు వ్యక్తిగతంగా మేలు చేసే కొన్ని కంపెనీలు ఉన్నాయని ఎదుటివారి మీడియాను విమర్శించే మీరు మీకంటూ సొంత పాంప్లెట్ మీడియా ఒకటుందని. దాదాపు 1000 మందిని సోషల్ మీడియా కేవలం ఫేక్ న్యూస్ పంపించడానికి పేటీఎం బ్యాచ్ ఉందని. వారికంత ప్రజల సొమ్మును అప్పనంగా ధారబోస్తున్నారని మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజల గమనిస్తున్నారు. పేదవారెవరు పెత్తందారులు ఎవరనేది ప్రజలకు బాగా తెలుసు మీరు బట్టన్ ఎక్కడ నొక్కుతున్నారు ప్రజల బట్టన్ లు ఎక్కడ ఊడుతున్నాయి అన్ని గమనిస్తున్నారు. ఎందుకంటే ఐదు సంవత్సరములు అధికారంలో ఉన్నప్పుడు నాయకులకు అంతా దోచిపెట్టి దాచుకోమని చెప్పి మన రాష్ట్రంలోని వ్యవస్థలన్నిటిని ఏ విధంగా నాశనం చేశారు అంతా గమనిస్తున్నారు. ఇప్పుడు ఎన్నికల సమీపిస్తున్నాయి కాబట్టి కార్యకర్తలు మీరే కష్టపడండి అధికారం వస్తే నేను దోచుకొని తింటాను అనేటువంటి కల్లబొల్లి మాటలు చెప్పి ప్రతిపక్షాలను విమర్శిస్తూ తెలుగుదేశం పార్టీను జనసేన పార్టీ ను అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పడానికే భయపడుతున్నారు ఎందుకో ఆ పేరు ఉచ్చరించిన వెంటనే అక్కడున్న యువకులంతా ఉత్సాహంతో కేరింతలు కొడతారని భయమా లేక అతను సాధారణ కానిస్టేబుల్ కొడుకు నేను లక్షల కోట్ల అధిపతిని అనేటువంటి అహంకార భావమా అది అతని విజ్ఞతకే వదిలేద్దాం. అనంతపురం జిల్లాకి గాలిలో వచ్చి నాలుగు గాలి మాటలు చెప్పినంత మాత్రాన ప్రజలు మీ కార్యకర్తలు అవివేకులు కారు ఆలోచనాపరులు. గ్లాసు సింక్ లో ఉన్న సైకిల్ బయట ఉన్నా మరీ మరీ వాడుతారు కానీ ఫ్యాన్ రివర్స్ లో తిరిగితే బయట పెట్టరు ముక్కలు చేసి గుజిడీలో పడేస్తారు. గుర్తుపెట్టుకోండి మన రాష్ట్ర భవిష్యత్తును తిరోగమనం లోకి పంపిన మీ పార్టీకి వచ్చే ఎన్నికల్లో తిలోదకాలు ఇవ్వటానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని అనంతపురం జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి చొప్పా చంద్రశేఖర్ ఎద్దేవా చేసారు.