ఉద్ధానం సమస్యపై 10 వేలు సంతకాలు సేకరణ పూర్తి

ఇచ్చాపురం నియోజకవర్గం: ఉద్ధానంలో కిడ్నీ సమస్యపై నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు నిర్వహిస్తున్న లక్ష సంతకాల సేకరణలో భాగంగా కవిటి మండలంలో కుసుంపురం గ్రామంలో గురువారం ఆటలాడుకుంటూ ఆనందంగా గడుపుకోవాల్సిన వయస్సులో కిడ్నీ వ్యాధికి గురై డయాలసిస్ తో గడుపుతున్న జుత్తు ఓంకార్ 16 ఏళ్ల బాలుడు చేత 10,000వ సంతకం చేయించి, అతని తల్లిదండ్రులను జనసేన పార్టీ ఇంచార్జ్ దాసరి రాజు ఓంకార్ ఆరోగ్య పరిస్తితి అడిగి తెలుసుకొనగా డయాలసిస్ అవుతున్న అతనికి పెన్షన్ వస్తుంది కానీ ప్రభుత్వము నుండి ఎటువంటి మందుల సహాయం లభించడం లేదు అని వారు తెలిపారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ ప్రభుత్వాలకి, అధికారులకి ఇలాంటి విషయాలు తెలియజేయడానికే ఈ లక్ష సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగింది అని కిడ్నీ సమస్యతో డయాలసిస్ అవుతున్న పదహారేళ్ళ ఓంకార్ సంతకంతో కిడ్నీ సమస్య పరిష్కారం కొరకు ఇచ్ఛాపురం జనసేన పార్టీ చేపట్టిన లక్ష సంతకాల సేకరణలో 10 వేలు సంతకాలు పూర్తి చేసుకోవడం జరిగింది. కావున నియోజకవర్గంలో అందరూ ఈ లక్ష సంతకాల సేకరణలో పాల్గొని మన ఉద్దానాన్ని పట్టి పీడిస్తున్న కిడ్నీ సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేద్దాం అని దాసరి రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కంచిలి మండల అధ్యక్షులు డొక్కరి ఈశ్వరరావు, ఇచ్చాపురం మున్సిపాలిటీ అభ్యర్థి రోకళ్ళ భాస్కర్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దుగాన దివాకర్, కుసుంపురం జనసేన సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, సోషల్ మీడియా అభ్యర్థి రామకృష్ణ, జనసేన నాయకులు రాజా, చలపతి, రాజు, సతీష్, మోహన్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.