ఉద్ధానం సమస్యపై లక్ష సంతకాల సేకరణ

  • లక్ష సంతకాల సేకరణ కార్యక్రమానికి మద్దతు తెలిపిన సినీనటి కరాటే కల్యాణి

ఇచ్చాపురం నియోజకవర్గం: కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఇచ్ఛాపురం జనసేన తరుపున జనసేన పార్టీ ఇంఛార్జి దాసరి రాజు ఆధ్వర్యంలో చేపట్టిన లక్ష సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కవిటి మండలంలోని గొండ్యాల పుట్టుగ, ప్రగడ పుట్టుగ, రామయ్య పుట్టు, బొర్ర పుట్టుగ, తొత్తిడి పుట్టుగలలో సంతకాల సేకరణ కార్యక్రమం జరిగింది. జనసైనికులు ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ కిడ్నీ వ్యాధి నిర్దారణ అయిన తరవాత ఇచ్చే మందులు నాణ్యమైనవిగా ఉండాలని, కిడ్నీ రోగులకు అందించే పెన్షన్లు చాలా మందికి రావడం లేదని ప్రభుత్వం దృష్టి పెట్టి వారికి న్యాయం చేయాలని అన్నారు. ఆదివారం సుమారుగా 1800 సంతకాలు సేకరించడం జరిగింది. ఒక కార్యక్రమంలో పాల్గొనడానికి ప్రగడ పుట్టుగ విచ్చేసిన సినీనటి కరాటే కల్యాణి లక్ష సంతకాల సేకరణ కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం అని, జనసేన పార్టీ ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తుంది అని తన లక్ష సంతకాల సేకరణకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, మున్సిపాలిటీ వార్డ్ ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, సర్పంచ్ అభ్యర్థి అంగ సురేష్, జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు దూగాన దివాకర్, జగదీశ్, జయ కృష్ణ, రాము, సునీల్, గోపి, శేషు, ప్రవీణ్, వంశీ, హేమ సుందర్, వసంత కుమార్, చక్రి, ఆకాష్, అంగద రావు, రాజశేఖర్, తలగాన ఈశ్వర్ రావు, ధనుంజయం, హేమా చలపతి రాజు, వాసుదేవ్, దేవా, వల్లభ, మోహన్, భోగేశ్, ప్రవీణ్ తది తరులు పాల్గొన్నారు.