యువత ఆశయాలకు దిక్సూచి స్వామి వివేకానంద: నలిశెట్టి శ్రీధర్

ఆత్మకూర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకి ఆరాధ్యదైవం అని, ఆయన జాతికి ఓ ఇన్స్పిరేషన్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూర్ నియోజకవర్గ నాయకులు శ్రీనివాస్ భరత్, పసుపులేటి శ్రీరామ్, రెడ్డి సునీల్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నాగరాజు యాదవ్, చేజర్ల ఇంచార్జ్ అనిల్ రాయల్, ఆత్మకూర్ నాయకులు వేణుగోపాల్ రాయల్, సంగం ఇంచార్జ్ రాకేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.