మైనర్ బాలికపై అత్యాచార ఘటనను ఖండిస్తూ.. మధిర జనసేన నిరసన కార్యక్రమం

హైదరాబాద్ మైనర్ బాలికపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ.. మధిర నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గం నాయకులు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ… అత్యాచారం జరిగి ఐదు రోజులు కావస్తున్నా నిందితులను అరెస్ట్ చేయకపోవడం చాలా బాధాకరమని అన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వo,పోలీస్ శాఖ వారు నిందితుల్ని అరెస్టు చేయాలనీ ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తక్షణమే బాధితురాలి కుటుంబంకు న్యాయం చేయాలనీ.. న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని.. పోలీస్ శాఖ వారిని కోరడం జరిగింది. తక్షణమే నిందితులపై చర్యలు తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బాధితులకు న్యాయం జరిగే విధంగా జనసేన పార్టీ ప్రజల తరఫున నిలబడి బాధితురాలికి న్యాయం చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియజేస్తామని ఆయన తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయమని జనసేన పార్టీ తరఫున, ప్రజల తరఫున తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ వారికి వినతి పత్రం ఇవ్వడానికి వెళితే జనసేన పార్టీ అధ్యక్షులు వేమూరి శంకర్ గౌడ్ ని అక్రమంగా అరెస్టు చేయడం చాలా బాధాకరమని అన్నారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు వేమూరి శంకర్ గౌడ్ ని తక్షణమే విడుదల చేయాల్సిందిగా.. విడుదల చేయని పక్షాన రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని.. అదేవిధంగా అక్రమ అరెస్టులకు జనసేన పార్టీ భయపడదని.. ప్రజల పక్షాన పోరాటం చేయడానికి జనసేన పార్టీ ఎప్పుడు ముందు ఉంటుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర నియోజకవర్గం స్టూడెంట్ వింగ్ వేముల వినయ్ కుమార్, బోనకల్ మండలం నాయకులు ఎస్ కె బాజీ, లక్కీ శెట్టి సాయి కుమార్, అద్దంకి సంతోష్ కుమార్, ఎస్కే జానీ, భాష, మధిర నియోజకవర్గం స్టూడెంట్ వింగ్ గంధం ఆనంద్, నవీన్ తదితరులు పాల్గొన్నారు.