పదవుల కోసం గిరిజనుల అస్థిత్వంపై కుట్రలకి తెగబడతారా?: డా. గంగులయ్య

పాడేరు: జనసేనపార్టీ కార్యాలయంలో మంగళవారం పాత్రికేయులతో జనసేన పార్టీ అరకు పార్లమెంట్ ఇన్చార్జ్ డా. గంగులయ్య, పాడేరు, అరకు నియోజకవర్గాల ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఇటీవలే మణిపూర్ రాష్ట్రంలో ఆధివాసీలపై జరిగిన అకృత్యాలు, అమానుష సంఘటనలపై మాట్లాడుతూ రెండు వర్గాలుగా ఉన్న మైతి, కుకీ ఆదివాసీ తెగల మధ్య ఆధిపత్య పోరు, అస్తిత్వ పోరు జరుగుతుందని, దీనికి గల మూలాలపై క్షుణ్ణంగా పరిశీలన చేస్తే హక్కులు పూర్తిగా కోల్పోయిన ఒక తెగ ఒకవైపు, ప్రస్తుతం హక్కులు కోల్పోయే పరిస్తితుల్లో ఉన్న ఒక తెగకు మధ్య జరుగుతున్న పోరుకు అగ్నికి ఆజ్యం పోసేలా మతం, రాజకీయం, సహజవనరులు దోచుకునే కార్పోరేట్ శక్తులు తోడవ్వడం, దేశ అస్థిరత సృష్టించే శక్తులకు సరైన సమయం దొరకడంతో ఆయుధాలు సరఫరా చేసే విదేశీ శక్తులు కూడా తోడయ్యాయి. ఫలితంగా మానవత్వం మరిచి మృగలుగా ప్రవర్తించే పరిస్థితిని యావత్ భారతదేశం చూసింది. ఇది జాతి మొత్తం సిగ్గుతో తలవంచుకునే సంఘటన ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యదేశానికి వుండే రాజ్యాంగ విలువలు ఇదేనా? అంటూ ప్రశ్నించారు. దేశంలో ఆదివాసీ ప్రజల అస్థిరతకు వారి అస్థిత్వంపై కక్ష్య సాధింపుకి ఇది గొప్ప ఉదాహరణ చెప్పవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఎస్టీల జాబితాలో మెజారిటీ వర్గమైన బెంతో ఒరియా, బోయవాల్మీకీలను చేర్చాలని టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు గతంలో ప్రధిపాదనలు పార్లమెంట్ కి పంపింది. దానికి గిరిజన ప్రజాప్రతినిధులు కూడా మౌనాంగీకారం తెలిపారు. యావత్ గిరిజన జాతికి తెలిసిన విషయమే! ఈ గిరిజన జాతి ద్రోహులందరు కలిసి మరో మణిపూర్ అల్లర్లు, సంఘటనలు సృష్టించి తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఈ ప్రతిపాదనలు చేశారా?.. పదవుల కోసం తమ జాతి ఆస్తిత్వంపై కూడా ఇంత కుట్రలకి తెగబడతారా? మొత్తం గిరిజన జాతి మేల్కోవాల్సిన సమయం ఇదేనని అన్నారు. మరో మణిపూర్ ఘటనలు సృష్టించి గిరిజన జాతిని బలి తీసుకోవాలని చూస్తున్నారా?.. దేశంలో మొదటి పౌరులు స్థానంలో ఒక ఆదివాసీ బిడ్డ శ్రీ ద్రౌపదిమూర్మ్ గారు రాష్ట్రపతిగా ఉన్న కూడా ఆధివాసీలపై దాడులు హెచ్చుమీరుతూనే ఉంది. పరిరక్షించాల్సిన ప్రజాప్రతినిధులు, రక్షణ విభాగాలు సైతం చేష్టలూడిగి చూస్తూవుండడం ప్రజాస్వామ్య విధానాలపై రోజు రోజుకి ఈ తరం యువతకి నమ్మకం సన్నగిల్లుతోంది. కాశ్మీర్ పండిట్స్ ఊచకోతలు చూశాం పంటి బిగువున భరించాం, దేశంలో ఎన్నో అస్థిరత సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఈ ఇరవయ్యవ శతాబ్దంలో కూడా ఇంకా ఇటువంటి మానవత్వం మంట గలిపే సంఘటనలు భరించడానికి ఈ తరం సిద్ధంగా లేదు. ఏదీ ఏమైనప్పటికి ఒక అమానుష సంఘటనలకు కారకులని కఠినంగా శిక్షించాలి. బాధితులకు సత్వరమే న్యాయం చెయ్యాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ఇటువంటి అమానుష సంఘటనలను తీవ్రంగా కండిస్తున్నాం అన్నారు. ఈ సమావేశంలో పాడేరు నియోజకవర్గ వీరమహిళలు కిటలంగి పద్మ, బొంకుల దివ్యలత, నాయకులు నందోలి మురళీకృష్ణ, చిన్నబ్బాయి, కిల్లో రాజన్, మసాడి భీమన్న, ఈశ్వర్రావు, రమేష్, నగేష్, అరకు నియోజకవర్గ నాయకులు బలిజ కోటేశ్వరరావు, కొన్నేడి లక్ష్మణ్ రావు, సీదారి దనేశ్వర్రావు, కోడా చందు, సురేష్ ప్రదాని తదితరులు పాల్గొన్నారు.