మెగాఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తాం: యడ్ల గణేష్ యాదవ్

  • సీపీఐ నారాయణ, చిరంజీవి పై అనుచిత వ్యాఖ్యలపై స్పందించిన జిల్లా చిరంజీవి యువత అధికార ప్రతినిధి యడ్ల గణేష్ యాదవ్
  • సీపీఐ నారాయణ మాటలను వెనక్కి తీసుకోవాలని జిల్లా చిరంజీవి యువత డిమాండ్

ప్రముఖ సినీనటులు, మాజీ రాజ్యసభ సభ్యులు మెగాస్టార్ చిరంజీవి పై సీపీఐ నారాయణ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా విశాఖ జిల్లా చిరంజీవి యువత అధికార ప్రతినిధి, జనసేన పార్టీ భీమిలి నియోజకవర్గ నాయకుడు యడ్ల గణేష్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించి నారాయణ వాఖ్యలపై ఖండించారు.

యడ్ల గణేష్ యాదవ్ మాట్లాడుతూ మా ఆరాధ్యాదైవం, మా అభిమానుల సేవలకు మార్గదర్శి, మథర్ తెరిసా తరువాత సేవలకు ప్రతిరూపమైన చిరంజీవి పై నారాయణ గారు చేసిన వ్యాఖ్యలకు జిల్లా చిరంజీవి యువత తరుపున ఖండిస్తున్నామని, రాష్ట్రాంలో మేము బతికే ఉన్నాం అని పబ్లిసిటీ కోసం నారాయణ లాంటి వాళ్లు చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ గార్ల పేర్లు ప్రస్తావించుకొని పబ్లిసిటీ తెచ్చుకుంటూన్నారు సిపిఐ నారాయణ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి అని మండిపడ్డారు.

సినీ ఇండస్ట్రీకి పెద్దదిక్కుగా సినీ కార్మికులను, అభిమానులను,కళాకారులను, తను మాధ్యమాలాద్వారా చలించి ఎంతో లెక్కలేనిమందికి ఆర్ధికంగా ఆదుకునే ఆపద్భాంధువుడని, ప్రపంచానికే ఆదర్శమైన, ఇటువంటి మహనీయున్ని అనటానికి మాటలేలా వచ్చాయిని నీలాదీశారు. చిరంజీవి పై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోతే నారాయణ పై అఖిలభారత చిరంజీవి యువత,రాష్ట్ర చిరంజీవి యువత ఆదేశాల మేరకు దీనిపై మరింత ఉద్యమిస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో రక్తదానం, నేత్రధానంతో పాటు కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో ఆక్సీజన్ సిలండర్లు ప్రజలకు అందించి ప్రాణదాతగా నిలిచి, మాకు అభిమానులకు స్ఫూర్తి ప్రధాతగా ఉన్న మా దైవం చిరంజీవి ని నారాయణ అనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, మా మెగాఫ్యామిలీ హీరోల ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాటమే మా ధేయమని, నారాయణ, చిరంజీవి గారికి,అభిమానులకు క్షమాపణ చెప్పాలని, చిరంజీవిగారు పై చేసిన వాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇకపై మా మెగాఫ్యామిలీ జోలికొస్తే తాటతీస్తామని వారిరిరువురు హెచ్చరించారు.
కార్యక్రమం లో దిలీప్, హరీష్, బలివాడ సాయి కృష్ణ వెంటక సాయి, సాయి వర్మ శ్యామ్ తదితరులు అభిమానులు పాల్గొన్నారు.