జోహరాపురం వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలి

•జనసేన జిల్లా నాయకులు పవన్ కుమార్

కర్నూలు పాత నగరం నుండి జోహరాపురంను కలిపే వంతెన నిర్మాణ పనులు వేగవంతం చేయాలని జనసేన పార్టీ జిల్లా నాయకులు పవన్ కుమార్ డిమాండ్ చేశారు. స్థానిక కర్నూల్ నగరంలోని జోహరాపురం వంతెన నిర్మాణ పనులను జనసేన పార్టీ కర్నూలు జిల్లా బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా నాయకులు పవన్ కుమార్ మాట్లాడుతూ 2018లో గత టిడిపి ప్రభుత్వం హయాంలో జోహరాపురం వంతెన నిర్మాణం పనులు ప్రారంభించినప్పటికీ నేటికీ పూర్తి కాకపోవడం దుర్మార్గమైన విషయం అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు 2019లో జోహరాపురం వంతెన నిర్మాణం పనులపై వైసీపీ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ కర్నూలులో నిరసన కార్యక్రమం చేపట్టిన ఇప్పటికీ ప్రభుత్వంలో స్పందన లేదన్నారు. ప్రజలకు నిత్యం ఉపయోగపడే జోహరాపురం వంతెన నిర్మాణం పనులకు వెంటనే నిధులు విడుదల చేసి పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించాలని లేని పక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన ఉదృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాలిక్, మహబూబ్, శశావల్లి పాల్గోన్నారు.