వైయస్సార్ కాంగ్రెస్ నుంచి జనసేనలోకి కొనసాగుతున్న వలసలు

  • వైయస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం నగర అధ్యక్షులు బండ్ల లక్ష్మీపతి రాయల్ జనసేనలో చేరిక

వైయస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం నగర అధ్యక్షులు బండ్ల లక్ష్మీపతి రాయల్ జనసేనలో చేరారు. జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్తి ఆరణి శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూర్ జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్. ఈ సందర్భంగా ఆరణి శ్రీనివాసులు, జనసేన, తెలుగుదేశం, బీజీపీ ఉమ్మడి తిరుపతి అభ్యర్థి మాట్లాడుతూ యువత పార్టీలోకి రావడం శుభపరిణామం. పవన్ కళ్యాణ్ తిరుపతిలో ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి లు అభివృద్ధి పేరిట అరాచకం సృష్టించారు. తిరుపతి ప్రజలు కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి లని ఓడించేందుకు నిర్ణయం తీసుకున్నారు. ఆధ్యాత్మిక నగరంలో ప్రజలు ప్రశాంతంగా ఉండేలా చూస్తా. భూమన కుటుంభం చేతిలో తిరుపతి జగన్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి కి నోచుకోలేదు. మోది అండతో, చంద్రబాబు అనుభవం కు తోడు పవర్ స్టార్ పవన్ తో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది. కూటమి ప్రభుత్వం రాగానే యువతకు ఉద్యోగాలు సృష్ఠి, పరిశ్రమల ఏర్పాటు చేస్తాం. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అయినా నన్ను ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నా అన్నారు. జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు కామెంట్స్ హరిప్రసాద్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేనలో యువత చేరడం సంతోషం. వైసీపీకి అభినయ రెడ్డికి లక్ష్మీపతి రాయల్ షాప్ ఇచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇకపై షాక్ లు మాత్రమే మిగులుతాయి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనను అంతం చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జనసేన అభ్యర్థి ఆరని శ్రీనివాసులను ప్రజలు గెలిపించేందుకు ఎప్పుడో నిర్ణయం తీసుకున్నారు. ప్రజల ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది. జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి మాట్లాడుతూ.. అబినయ్ రెడ్డిని ప్రజలు ఓడించడం ఖాయం. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువత జనసేనలోనికి రావడం సంతోషం. అందరం ఐక్యంగా ప్రచారం చేసి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులును గెలిపించుకుంటాం. ఆకేపాటి సుభాషిణి, జనసేన పిఏసీ కార్యదర్శి బలిజ సామాజికవర్గానికి ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి చేసింది ఏమి లేదు. కరుణాకర్ రెడ్డిని కాపు కాసెందుకు బలిజలు సిద్ధంగా లేరు. లక్ష్మీపతి రాయల్, జనసేన లో చేరిన నాయకుడు. పవన్ కళ్యాణ్ ఆలోచనలు, సిద్ధాంతాలు నచ్చి జనసేనలో చేరా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువతకి చేసింది ఏమి లేదు. నాతో మొదలైన రాజీనామాలు వైసిపి తిరుపతిలో ఖాళీ అవుతుంది. జనసేన.. టిడిపి.. బీజీపీ ఉమ్మడి తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు గెలుపు ఖాయమైంది. ఆరణి శ్రీనివాసులు మెజార్టీ పెంపుకి మేమంతా కలిసికట్టుగా కృషి చేస్తాం అని పేర్కొన్నారు.