సంపత్ వ్యాఖ్యలను ఖండించిన జనసేన పార్టీ దళిత నాయకులు

తాడేపల్లిగూడెం: కేటాక్స్ రూపంలో దోచుకున్న వాళ్ళని దాచుకున్న వాళ్ళని మీ పక్కన పెట్టుకుని నిప్పులాంటిమనిషి నికాసైన మనిషి ప్రజల మనిషి సాయం చేయడంలో వెనుకాడనీ మంచి మనిషి బొలిశెట్టి శ్రీనివాసును అవినీతిపరుడుగా మాట్లాడడాన్ని దళిత నాయకులు తీవ్రంగా ఖండించారు ఈ జగన్ పాలనలో ఎంతోమంది దళితులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు కోవిడ్ సమయంలో మాస్కులు గురించి నిలదీసిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను మతిస్థిమితం కోల్పోయినట్టుగా చిత్రీకరించి చివరకు ఆయన ప్రాణాలు పోవడానికి కారణమయ్యారన్నారు గూడెం నియోజకవర్గంలో ప్రజలు అన్ని విషయాలు గమనిస్తున్నారని గడిచిన ఐదు సంవత్సరాలలో నియోజకవర్గంలో ఎక్కడ సరైన అభివృద్ధి జరగలేదన్నారు మా నాయకుడును అవినీతిపరుడని విమర్శించే సంపత్ నీవు నీ గ్రామంలో సిమెంట్ రోడ్లకు ఇరువైపులా వేసే మట్టిని చెరువులో నుండి తవ్వించి 23 లక్షలు బిల్లు చేశావు అన్న విషయం మరిచిపోయావా? ఇది అవినీతి కాదా? బంగారు గూడెం లో ఔట్సోర్సింగ్ ఉద్యోగాల కొరకు 6 నుంచి 8 లక్షల రూపాయలు తీసుకున్నావని అయితే వారికి ఉద్యోగాలు ఇప్పించలేదని బంగారు గూడెంలో కొట్టు సమక్షంలోని వారు గొడవ చేసిన విషయం వాస్తవం కాదా? అని అన్నారు ఇలా దోచుకోవడం దాచుకోవడం మీ పార్టీకి మీ నాయకులకు మీకు చెల్లుబాటు అయినంతగా ఎవరికి అవదు అన్నారు గతంలో శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్ చేస్తున్న సమయంలో గూడెం ఎంతో అభివృద్ధి చెందిందని కొనియాడారు నియోజకవర్గంలో ప్రజల మనసుల్లో ఉన్న మనిషి బొలిశెట్టి అని అన్నారు. 2024 ఈ సార్వత్రిక ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో బొలిశెట్టి శ్రీనివాస్ గెలుపొందుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన దళిత నాయకులు పాల్గొన్నారు.