UGC Recruitment 2021: యూజీసీలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు..

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో-DEB కోసం ఈ జూనియర్ కన్సల్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 8 ఖాళీలున్నాయి. యూజీసీ అవసరాలను బట్టి పోస్టుల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. ఇవి కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అప్లై చేయడానికి 2021 జూలై 12 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్-UGC అధికారిక వెబ్‌సైట్ https://www.ugc.ac.in/ లో తెలుసుకోవచ్చు.

UGC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

జూనియర్ కన్సల్టెంట్ పోస్టులు- 8

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 జూలై 12

విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పాస్ కావాలి. డిస్టెన్స్, ఆన్‌లైన్ మోడ్ ఎడ్యుకేషన్‌కు సంబంధించిన అవగాహన ఉండాలి. ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, ఇంటర్నెట్ వినియోగం తెలిసి ఉండాలి.

వయస్సు- 2021 జూలై 12 నాటికి 35 ఏళ్ల లోపు

కాంట్రాక్ట్ గడువు- మొదట ఆరు నెలల కోసం నియమిస్తారు. ఆ తర్వాత పనితీరును బట్టి కాంట్రాక్ట్ పొడిగిస్తారు.

వేతనం- రూ.50,000 నుంచి రూ.60,000