కృతిసనన్ కి కరోనా పాజిటివ్.. సోషల్‌మీడియా వేదికగా వెల్లడి..

సూపర్‌ స్టార్  మహేష్ బాబు ‘వన్ నేనొక్కడినే’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన కృతిసనన్ తన అందచందాలతో కుర్రకారును హుషారెత్తించిన ఈ భామ ప్రస్తుతం కరోనాకు గురైంది. ఈ విషయాన్ని తనే స్వయంగా వెల్లడించింది.

కృతిసనన్ ప్రస్తుతం లుక్కా చుప్పి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్‌ చండీగఢ్‌లో కొనసాగుతుండగా వారం రోజుల క్రితం షూటింగ్ ముగించుకొని ఇంటికి వచ్చేశారు. అయితే ఆరోగ్యం నలతగా ఉండటం గమనించిన కృతి అనుమానం వచ్చి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకుంది. దీంతో కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని తనే ప్రముఖ సోషల్‌మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ముంబైలోని తన నివాసంలో హోమ్ క్వారంటైన్‌లో ఉంటున్నారు. అయితే ఈ మధ్య తనను కలిసిన వాళ్లు, బంధువులు, స్నేహితులు అందరూ కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ఇదిలా ఉంటే ప్రభాస్ హీరోగా పాన్‌ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్‌’ లో కృతిసనన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె సీత పాత్రలో నటించనున్నారు.