కరోనా ట్రీట్‌మెంట్..టాస్క్‌ఫోర్స్ పర్యవేక్షణ

కోవిడ్ పేషేంట్లకు ప్రవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న ట్రీట్మెంట్ ను పర్యవేక్షించేందుకు టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముగ్గురు ఐఏఎస్ లతో టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసారు. సభ్యులుగా రాహుల్ బొజ్జ, సర్ఫరాజ్ అహ్మద్, డీ. దివ్య ఉన్నారు. కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన ధరలు అమలవుతున్నాయా లేదా అని పర్యవేక్షించనుంది టాస్క్ ఫోర్స్.

పేషేంట్లకు కోవిడ్ ట్రీట్మెంట్ ఇస్తున్నప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన ప్రోటోకాల్స్ పాటిస్తున్నాయా లేదా పరిశీలన చేస్తుంది. ప్రైవేట్ ఆసుపత్రుల తీరును ఎప్పటికప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదించాలని ఉత్తర్వులు జరీ చేసింది. ఇక ఈ కొత్త టాస్క్ ఫోర్స్ కు సాంకేతిక సహకారం అందించనుంది రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంభ సంక్షేమ శాఖ.