కాటన్‌, జూట్‌ సలహా బోర్డులు ఇక పై రద్దు: జౌళిశాఖ

ఇప్పటికే హ్యాండ్‌లూమ్‌ బోర్డును రద్దుచేసిన కేంద్ర జౌళిశాఖ తాజాగా కాటన్‌ – జూట్‌ సలహామండళ్లను రద్దుచేస్తూ, సోమవారం నోటిఫికేషన్లు జారీచేసింది. ప్రభుత్వరంగ సంస్థలను హేతుబద్ధీకరించడంలో భాగంగా ఈ బోర్డులను రద్దుచేసినట్లు స్పష్టంచేసింది. తక్కువ యంత్రాంగం- గరిష్ఠ పాలన అన్న విధానంలో భాగంగా అన్ని ప్రభుత్వ వ్యవస్థలను క్రమపద్ధతిలో హేతుబద్ధీకరించడానికి ఈ చర్య తీసుకున్నట్లు పేర్కొంది.