నాగబాబుతో ‘బత్తుల’ మర్యాదపూర్వక భేటీ

హైదరాబాద్, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, పిఏసి సభ్యులు నాగబాబుని గౌరవపూర్వకంగా కలిసి రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ, అప్పుడప్పుడు ఎంతో గంభీరంగా ఉంటూ తమ్మునికి(సేనాని) రక్షణ కవచంలా ఉంటూ, వర్తమాన రాజకీయాలు, సామాజిక అంశాలను వాటి తాలూకా నేపథ్యాలను చారిత్రాక కోణాలను వాస్తవిక దృక్పథంతో అవగాహన పరుచుకుంటూ జనసేన శ్రేణులకు రాజకీయ విలువలను, లక్ష్యాలను బోధిస్తూ సందర్భాన్ని బట్టి ప్రత్యర్థులకు ఛలోక్తులు, పంచ్ లు విసురుతూ, విభిన్నమైన వ్యక్తిత్వంతో రాజకీయాల్లో తనదైన ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న మోగాబ్రదర్ నాగబాబుని హైదరాబాదులో వారి ఆఫీసునందు రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిసి పిఏసి సభ్యులుగా పార్టీకి సేవలు అందిస్తూ, ఇటీవలే జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన శుభసందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తూ పార్టీకి వారు చేస్తున్న విశేషమైన సేవలకుగాను చిరుసత్కారం అందజేస్తూ అభినందనలు తెలియజేసారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ జనసేన పార్టీలో జాయిన్ అయి 300 రోజులు అయిన సందర్భంగా మరియు జనహితమే తన అభిమతంగా నియోజవర్గ ప్రజలతో మమేకమవుతూ, వారి కష్టనష్టాల్లో తోడుగా ఉంటూ పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం, రాజానగరం నియోజకవర్గంలో జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో అభివృద్ధి పరచి, తద్వారా జనసేన పార్టీని నియోజకవర్గ ప్రజలకు చేరువ చేయాలనే సదుద్దేశంతో తలపెట్టిన “జనం కోసం జనసేన” “మహాపాదయాత్ర” ఇటీవలే విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలానే నియోజకవర్గంలో పలు సందర్భాల్లో ప్రజాసమస్యలపై చేసిన అనేక పోరాటాలు, అనేక కష్టాల్లో బాధల్లో ఉన్న బాధిత కుటుంబాలను ఆదుకున్న తీరు, పలు సందర్భంలో బాధిత, పీడిత కుటుంబ సభ్యులకు అందించిన ఆర్థిక సహాయ సహకారాలు క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని అభివృద్ధి పరిచిన తీరు ఇతర పార్టీలకు చెందిన నేతలను, కార్యకర్తలను జనసేన వైపు ఆకర్షించేలా చేసి జనసేన పార్టీలో జాయిన్ చేసిన వివరాలు ఇలా అనేక పార్టీ అభివృద్ధి విషయాలతో కూడిన (ముద్రించిన) పుస్తకమును ఈ సందర్భంగా నాగబాబుకి బత్తుల బాలరామకృష్ణ బహుకరించారు. బత్తుల బలరామకృష్ణ నియోజకవర్గ క్షేత్రస్థాయిలో చేస్తున్న కార్యక్రమాలకు నాగబాబు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ జనసేన శ్రేణులు సమన్వయంతో వ్యవహరిస్తూ, సమిష్టిగా గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాబోవు రోజుల్లో పార్టీ పటిష్టతకు తీసుకోవాల్సిన చర్యలను, రాబోవు ఎన్నికలకు ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి వ్యూహాలను దిశానిర్దేశం చేశారు.