పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తే ఇక నుండి చర్యకి ప్రతిచర్య ఉంటుంది – మోపిదేవి మండల జనసేన

అవనిగడ్డ, గత మూడు రోజులుగా పవన్ కళ్యాణ్ మీద రాష్ట్ర స్థాయిలో జగన్ రెడ్డి తన పార్టీ నాయకులతో కలసి మహిళా వాలంటీర్లును అడ్డు పెట్టీ చేస్తున్న చర్యలను ఖండిస్తూ మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణజిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి రాయపూడి వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ రెడ్డి మరియు నాయకులు వాలంటీర్లను కూలీలుగా వాడుకుంటున్నారు అని అలాగే ప్రభుత్వ అధికారులు చేయాల్సిన పనులను వాలంటీర్స్ తో చేయిస్తున్నారు వారిపై పని ఒత్తిడి చేస్తున్నారు అని వాలంటీర్స్ ఇది గమనించి పవన్ కళ్యాణ్ మీద అనవసర వాఖ్యలు చేయవద్ధు అని అన్నారు. తరువాత కృష్ణజిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి బాసు నాంచారయ్య నాయుడు మాట్లాడుతూ మోపిదేవి మండల వైఎస్సార్సీపి నాయకులు మరియు వాలంటీర్స్ పవన్ కళ్యాణ్ మీద విమర్శ చేసే ముందు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో చూడాలి చూడకుండా మీ పదవులు గుర్తింపు కోసం అనవసర వాఖ్యలు చేయవద్దని, పవన్ కళ్యాణ్ చెప్పింది వాలంటీర్స్గా పని చేస్తున్న వారికి సరైన గుర్తింపు లేదు, వారి విద్యా అర్హతకు తగ్గ ఉద్యగం కాదు అని మీకోసం మరియు ప్రజల కోసమే పవన్ కళ్యాణ్ మాట్లాడేది అని అన్నారు. అలాగే ఆ తరువాత మోపిదేవి మండల జనసేన పార్టీ అధ్యక్షులు పూషడపు రత్న గోపాల్ మాట్లాడుతూ మోపిదేవి మండల వైఎస్సార్సీపి నాయకులు మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి గత జీవితం గురించి మాట్లాడితే మీ వ్యక్తిగత జీవితం గురించి మేము మాట్లాడతాము అలాగే సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తాం అని అన్నారు అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడింది రాష్ట్రంలో కొందరు వాలంటీర్స్ దొంగతనాలు, హత్యాయత్నానాలు, హత్యలు, స్మగ్లింగ్ చెస్తున్నారు అలాగే వాలంటీర్స్ ద్వారా ప్రజల దగ్గర వ్యక్తిగత ఆధారాలు జగన్ రెడ్డి తీసుకుంటున్నారు అని అన్నారు గుమ్మడి కాయల దొంగల్లా కొందరినీ అంటే మోపిదేవి నుండి రాష్ట్ర నలుమూలల వాలంటీర్స్ అందరు భుజాలు తడుముకుంటున్నారు అని ఎద్దేవా చేసారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గ జనసేన పార్టీ ఐటి కో-ఆర్డినేటర్ సూదాని నందగోపాల్, మోపిదేవి మండల పార్టీ ఉపాధ్యక్షులు బోగిరెడ్డి సాంబశివరావు, మోపిదేవి మండల స్థాయి నాయకులు కామిశెట్టి శ్రీనివాసరావు, అర్జా కిరణ్ కాంత్, కలపాల ప్రసాద్, ఆకుల పవన్ కళ్యాణ్, మోపిదేవి మండల పరిధిలోని గ్రామ నాయకులు బాచు శ్రీను, మత్తి వంశీ, యర్రంశెట్టి సునీల్, కొలుసు శివ ప్రసాద్ మరియు మోపిదేవి మండల జనసైనికులు చవాకుల సురేష్, కోసూరు సీతారామంజనేయులు, రేపల్లె నాగేంద్ర బాబు, కూరేటి జగన్, కోసూరు అన్వేష్, రాఘవ కూరేటి పాల్గొన్నారు.