అగ్ని ప్రమాద బాధితునికి అండగా నిలచిన దల్లి గోవిందరెడ్డి

  • బాధిత కుటుంబానికి 10000 రూపాయలు ఆర్థికసహయం

గాజువాక నియోజకవర్గం: 64వ వార్డ్, యారాడ గ్రామస్థుడు బంక రాజుబాబు టిఫిన్ షాపు ఇటీవలే అకస్మాత్తుగా మంటలు చలరేగడంతో షాపు మొత్తం దగ్ధమైంది. విషయం తెలుసుకున్న స్థానిక వార్డు కార్పొరేటర్, జనసేన పార్టీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దల్లి గోవిందరెడ్డి సానుకూలంగా స్పందించి సంఘటన స్థలానికి చేరుకొని వారిని పరామర్శించి, ఓదార్చారు. వారిని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంచి మనసుతో నష్టపోయిన టిఫిన్ షాపు యజమాని బంక రాజుబాబు కు గోవిందరెడ్డి ఆయన సొంత నిధులతో ఆ కుటుంబానికి10000 రూపాయలు ఆర్థికసహయం అందించారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా మాజీ అధికార ప్రతినిధి చోడిపిల్లి ముసలయ్య, 64వ జనసేన నాయకులు, యారాడ గ్రామస్తులు, గ్రామ పెద్దలు మరియు జనసేన కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.