దార్లలంక వెంకన్న కుటుంబానికి ఆర్ధిక సాయమందించి అండగా నిలిచిన బండారు

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం, ఆలమూరు మండలం, చొప్పెల్ల గ్రామం నందు గురువారం కొత్తపేట జనసేన పార్టీ ఇన్చార్జి, ప్రముఖ నేత బండారు శ్రీనివాస్ పర్యటించారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం ఇంటికి పెద్దదిక్కు దార్లలంక వెంకన్నను కోల్పోయిన వారి కుటుంబాన్ని కలిసి వారిని పరామర్శించి రూ.10,000/-ఆర్థికసాయం అందించారు. గురువారం ఆలమూరు మండల పర్యటన సందర్భంగా వారి వెంట పలువురు జనసైనికులు, కార్యకర్తలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో చొప్పెల్ల ఎంపిటిసి సభ్యులు జాంపోలు నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ళ డేవిడ్ రాజ్, సలాది జయ ప్రకాశ్ నారాయణ మూలస్థానం గ్రామ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆలమూరు మండల జనసేన యువ నాయకులు (జెపి), ఆలమూరు మండల జనసేన సీనియర్ నాయకులు కొత్తపల్లి నగేష్ తదితరులు పాల్గొన్నారు.