టిడ్కో ఇళ్లు, జగనన్న కాలనిల భాదితుల తరుపున దర్శి జనసేన గళం..

  • జగనన్న కాలనీలలో.. కనీస వసతులు కల్పించాలి
  • కాలనీలను నివాసయోగ్యంగా మార్చి అర్హులకు అందచేయాలి.
  • దర్శి జనసేన పార్టీ ఇంచార్జ్ బొటుకు రమేష్‌బాబు డిమాండ్

దర్శి నియోజకవర్గం: జగనన్న కాలనీలలో కనీస సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమయిందని జనసేన పార్టీ దర్శి ఇంచార్జ్ బోటుకు రమేష్ విమర్శించారు. జనసేన పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు ప్రకాశం దర్శి నియోజకవర్గంలో జగనన్న కాలనీల పరిశీలనతోపాటు సోషల్ ఆడిట్‌లో కార్యక్రమంలో శనివారం దర్శి ప్రాంతంలోని దొనకొండ మండలంలోని ఇండ్లచెరువు కాలనీ, వెంకటాపురం కాలనీలను బొటుకు రమేష్ బాబు తన బృందంతో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బొటుకు రమేష్‌బాబు మాట్లాడుతూ.. జగనన్న కాలనీల్లో కనీస సౌకర్యాలు కూడా లేవని, కొన్ని చోట్ల ఇంతవరకు పునాది కూడా వేయలేదని ఆవేదనవ్యక్తం చేశారు. జగనన్న కాలనీల్లో ఒక్క ఇల్లు సైతం నిర్మాణానికి నోచుకోలేదన్నారు. చాలా ప్రాంతాలు ముళ్లపొదలతో అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్నాయని పేర్కొన్నారు. పునాదులు వేసిన చోట నీటి సౌకర్యం లేక నిర్మాణాలను అర్థంతరంగా ఆపేశారని తెలిపారు. ఇసుక, కంకర, ఇటుక సైతం అందుబాటులో లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని వీడి అర్హులకు అందరికీ స్థలాలను కేటాయించి, ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. ప్రజలకు అనువైన వాతావరణంలో ఇళ్లను నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున బొటుకు రమేష్‌బాబు డిమాండ్‌ చేశారు.

సర్కార్ నిర్లక్ష్యాన్ని వీడాలి: అనంతరం కురిచేడు మండలంలోని ఆవులమంద, నాయుడుపాలెం గ్రామాల్లోని జగనన్న కాలనీలను బోటుకు రమేష్ స్థానిక జనసేన నేతలతో సందర్శించారు. ఈ సందర్భంగా బొటుకు రమేష్‌బాబు మాట్లాడుతూ జగనన్న కాలనీల్లో అసంపూర్తిగా వున్న ఇళ్లను నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ప్రజలకు అనువైన వాతావరణంలో ఇళ్లను నిర్మించి ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ తరఫున బొటుకు రమేష్‌ బాబు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపులేటి చిరంజీవి, దొనకొండ మండల కమిటీ అధ్యక్షులు గుండాల నాగేంద్రప్రసాద్, కురిచేడు మండల కమిటీ అధ్యక్షులు మాదా వెంకట శేషయ్య, దర్శి నగర పంచాయతీ అధ్యక్షులు చాతిరాశి కొండయ్య, కురిచేడు మండల కమిటీ ఉపాధ్యక్షులు మంచాల నరసింహారావు, దర్శి మండల కమిటీ నాయకులు పుప్పాల పాపారావు, నందిపాటి లోకేష్, దొనకొండ జడ్పీటీసీ కంటెస్టెడ్‌ అభ్యర్థి, ఉపాధ్యక్షులు చేబ్రోలు నాగభూషణం, మాదికొండ ఏడుకొండలు, బాబు తదితరులు పాల్గొన్నారు.