‘ఆచార్య’గా డేవిడ్ వార్నర్.. వీడియో

ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటాడు. లాక్‌డౌన్‌ సమయంలో ఎన్నో టిక్‌టాక్‌ వీడియోలు చేసి అలరించాడు. భార్య, పిల్లలతో కలిసి అల్లు అర్జున్‌ బుట్టబొమ్మ సాంగ్‌కు స్టెప్పులేసి దక్షిణాది సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అలాగే బాహుబలిలో ప్రభాస్‌ డైలాగ్‌ చెప్పి భారత సీనీ ప్రియుల మనసును దోచుకున్నాడు.

ఇప్పుడు మళ్లీ తనదైన స్టైల్‌లో తెలుగు అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తోన్న ఆచార్య టీజర్‌ రెండు రోజుల క్రితం విడుదలైన సంగతి తెలిసిందే.

తాజాగా వార్నర్‌ రీఫేస్‌ యాప్‌ను ఉపయోగించి ఆచార్య టీజర్‌లో చిరంజీవి స్థానంలో తన ఫొటోను పెట్టి సరికొత్తగా విడుదల చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మెగా అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.