రేపటి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభం

తెలంగాణలో రేపటి నుంచి స్కూళ్లు, కాలేజీలు పునప్రారంభమవుతాయని మంత్రి సబితారెడ్డి ప్రకటించారు. ఆదివారం కొల్లాపూర్‌లోని ప్రభుత్వ స్కూళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి సబితా మాట్లాడుతూ.. పాఠశాలలకు విద్యార్థులను ఎలాంటి భయం లేకుండా తల్లిదండ్రులు పంపిచవచ్చని విద్యాసంస్థల్లో అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తరగతి గదుల్లో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తున్నామని వెల్లడించారు. ఒక గదికి 20 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేశామన్నారు. విద్యార్థుల మధ్య ఆరు ఫీట్ల దూరం ఉండేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు.శానిటైజేషన్, మంచినీటి ట్యాంకులు శుభ్రం చేయిస్తామన్నారు.ప్రతి పాఠశాలలో ఒక ఐసోలేషన్ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. తొమ్మిది, పదోతరగతుల నిర్వాహణ పరిశీలించిన తర్వాత.. కిందస్థాయి తరగతులపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యతో పాటు విద్యార్థుల సంరక్షణ ముఖ్యమేనని మంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు.