ఆత్మకూరులో పవనన్న ప్రజాబాట 14వ రోజు

ఆత్మకూరు, కనీస వసతులు లేక విలవిలలాడుతున్న విలీన గ్రామాల ప్రజలు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలన్న దృడసంకల్పంతో తలపెట్టిన పవనన్న ప్రజాబాట శనివారం ఆత్మకూరు మున్సిపల్ పరిధిలో 14వ రోజుకు చేరుకుంది. శనివారం ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని పేరారెడ్డి పల్లె గ్రామంలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఆత్మకూరు పట్టణాన్ని మున్సిపాలిటీగా మార్చే క్రమంలో జనాభా తక్కువ కావడంతో, నెల్లూరు పాలెం మరియు వెంకట్రావుపల్లి గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడం జరిగింది. మున్సిపాలిటీ ఏర్పడి పుష్కరకాలం దాటినప్పటికి, విలీన పంచాయతీల, గ్రామాలైన నెల్లూరు పాలెం, వెంకట్రావుపల్లి, పేరారెడ్డిపల్లి, అల్లిపురం, ముస్తాపురం, జాలయ్య నగరం, శాంతి నగరం, నర్సాపురం గ్రామాల్లో నేటికీ కనీస వసతులైన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతాలన్నీ ఇప్పటికీ పల్లెలలాగే ఉన్నాయని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు ఈ గ్రామాలపై శ్రద్ధచూపి కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని జనసేన పార్టీ తరఫున ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నలిశెట్టి శ్రీధర్ మాట్లాడుతూ ఆత్మకూరు మున్సిపాలిటీ సకల సౌకర్యాలతో, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలంటే, జనసేన పార్టీకి ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేసుకోవాలని తెలిపారు. పవన్ అన్న ప్రజాబాట 14వ రోజు సందర్భంగా స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని అక్కడికి ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేంద్ర, వంశీ, చంద్ర, పవన్, నాగరాజు, అనిల్, భాను, హజరత్ తదితరులు పాల్గొనడం జరిగింది.