చీరాలలో పవనన్న చేనేత బాట 40వ రోజు

చీరాలలో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు సూచనలతో “40 రోజుల” నుండి చీరాల నియోజకవర్గ జనసేన పార్టీ యువ నాయకత్వం ఆధ్వర్యంలో “నేతన్న” పడుతున్న ఇబ్బందులను తెలుసుకుంటున్న “పవనన్న చేనేత బాట” కార్యక్రమాన్ని అడుగడుగున ఆదరిస్తున్న చీరాల నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదములు. పవనన్న చేనేత పాట కార్యక్రమం గురించి ఈ యువ జనసేన నాయకులు మాట్లాడుతూ కర్ణ కిరణ్ తేజ్ అధ్వర్యంలో పసుపులేటి సాయి (పందిళ్ళపల్లి), పింజల సంతోష్(నీలకంఠాపురం), పృథ్వీ శ్రీహరి (దంటంపేట), వరం బూడిద (చేనేతపురి), పల్లపోలూ సాయి(పందిళ్ళపల్లి), శ్రీను(పందిళ్ళపల్లి), కిషోర్(వేటపాలెం), సదాశివరావు (వేటపాలెం) మరియు ఐటీ కోఆర్డినేటర్ భూపతి మనోజ్ కుమార్ ల సహకారంతో, నియోజకవర్గ సీనియర్ నాయకుల అండండలతో చీరాలలో నియోజకవర్గంలో ప్రతీ చేనేత కుటుంబ సమస్యను గడప గడపకు వెళ్ళి తెలుసుకోవడం జరుగుతుందని చెప్పడం జరిగింది.