వైసీపీ నాయకుల్ని ప్రజలు నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి: బత్తుల బలరామకృష్ణ

  • వైసీపీ నాయకుల్ని ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి
  • మొదటిగా ప్రభుత్వమే నివాస యోగ్యమైన నాణ్యమైన ఇళ్ళు కట్టించి ఇస్తాము అన్న వైసీపీ ప్రభుత్వం పేదప్రజలను దారుణంగా మోసం చేసింది
  • జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం…సీతానగరం మండలం, సింగవరం వంగలపూడి గ్రామాల్లో. బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో

రాజానగరం: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు…. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సోషల్ ఆడిట్ కార్యక్రమం జగనన్న ఇళ్ళు – పేదలందరికీ కన్నీళ్లు .#ఝగనన్నంఒసం ..లో భాగంగా రెండవ రోజు సీతానగరం మండలం, వంగలపూడి గ్రామంలో … జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ వారి సతీమణి శ్రీమతి వెంకటలక్ష్మి, నియోజవర్గ సీనియర్ నేతలు, జనసైనికులు, సీతానగరం మండల జనసేన నేతల సమక్షంలో జరిగింది…. వంగలపూడి సింగవరం గ్రామాలకు సుమారు 7,8 కిలోమీటర్లు దూరంగా… ప్రజలకు ఏమాత్రం నివాసయోగ్యనికి అనుకూలంగా లేని ప్రాంతాల్లో ఇళ్ల స్థలాన్ని కేటాయించారని… రైతుల దగ్గర తక్కువ మొత్తంలో కొనుగోలు చేసి… ప్రభుత్వం నుంచి మాత్రం పెద్ద మొత్తంలో డ్రా చేసుకుని వైసిపి నేతల జేబులు కాసులు వర్షం కురిపించుకున్నారని.. ఈ స్థలాల్లో అడుగు మట్టి తీస్తే నీరు ఊరడం…. చుట్టూ ఏమాత్రం జనసంచారం లేని ప్రాంతం కావడం… ఈ స్థలాన్ని లబ్ధిదారులు స్వచ్ఛందంగా తిరస్కరించడం జరిగిందని…. కేవలం వైసీపీ నేతలు జేబులు నింపుకోవడం కోసమే ఇళ్ల స్థలాలు కేటాయించారని… దీన్నందరూ గమనించి వైసిపి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని దానికి జనసేన పార్టీ పేదలకు పూర్తిగా సహకరిస్తుందని ఈ సందర్భంగా బత్తుల దంపతులు మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అరాచకంపై ధ్వజమెత్తారు అనంతరం మీడియా ప్రతినిధులకు ఇళ్ల స్థలాల్లో జరిగిన అవకతవకలను స్వయంగా జగనన్న కాలనీలో పర్యవేక్షిస్తూ చూపించారు…. ఈ కార్యక్రమంలో మట్ట వెంకటేశ్వరరావు, మద్దాలి ఏసు పాదం చీకట్ల వీర్రాజు, మట్ట సుబ్రహ్మణ్యం, కొండేటి సత్యనారాయణ, మాధవరపు వీరభద్ర రావు, అడపా నరసింహం, బండి సత్య ప్రసాద్, రుద్రం కిషోర్, సందీప్, బ్రహ్మం, నాగేంద్ర, పిండి వివేక్, తల్లి నాగేంద్ర, గట్టి మణికంఠ, సుందరపల్లి చైతన్య, దొడపాటి కరుణాకర్, మద్దాల బాలు, కొనాల దుర్గాప్రసాద్ ప్రతి వారిని ఇతర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.