జనసేన పార్టీ ఆధ్వర్యంలో బొజ్జా తారకం వర్ధంతి

అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం హక్కుల పోరాట యోధుడు స్వర్గీయ బొజ్జా తారకం ఏడవ వర్ధంతి సందర్భంగా అమలాపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో బొజ్జా తారకం సంస్మరణ సభ జరిగింది. స్థానిక ప్రెస్ క్లబ్ భవన్ లో జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజబాబు అధ్యక్షతన జరిగినది. ఈ సంస్మరణ సభలో పలువురు జనసైనికులు నాయకులు మాట్లాడారు అన్ని వర్గాల ప్రజల హక్కుల కోసం నిజాయితీగా పోరాడిన యోధుడని, ఈనాటి సమాజానికి అటువంటి నిబద్దత కలిగిన నాయకులు అవసరం ఉందని, అటువంటి వారికి జనసేన పార్టీ ఘనంగా నివాళులు అర్పిస్తుంది అని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పురపాలక కౌన్సిలర్ పిండి అమరావతి, రాష్ట్ర నాయకులు మహదశ నాగేశ్వరావు, జిల్లా నాయకులు సందడి శ్రీనుబాబు, చిక్కాల సతీష్, చిక్కం భీముడు, తాళ్ల రవి ముత్తాబత్తుల శ్రీను, మోకా బాలయోగి, ఆకుల బుజ్జి, సుధా చిన్న, పిండి రాజా, కుంపట్ల వెంకట రమేష్, సత్తి శ్రీనివాస్, పోనకల ప్రకాష్, చిక్కం సూర్యమోహన్, గోలకోటి వెంకటేష్, తూము రమేష్, మధుర మూర్తి, పోతుమూడి రవికుమార్, కారెం వెంకటరావు, కడిమి చినబాబు, పెయ్యల స్వామి, ఈతకోట రవినాని, గుండెమోగుల బాలరాజు, పామర్తి నాయుడు, పిండి సురేష్, కూనంసెట్టి రాజేష్, జనిపెళ్ల శివాజీ, గిడ్ల బాలకుమార్, కరిముల్లా బాబా, మహ్మద్ షఫీ, అల్లం సురేష్, చిక్కం సుధ, గోళ్ళ కమల, ముత్యాల మణమ్మ, నల్లా వరలక్ష్మి, పలువురు రాష్ట్ర జిల్లా నాయకులు, కౌన్సిలర్లు, వీర మహిళలు జనసైనికులు పాల్గొన్నారు.