అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ తెదేపా నిరసన ప్రదర్శనలు

మూడు ముక్కల రాజధాని వద్ధు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ.. తెదేపా చిత్తూరు పార్లమెంట్‌ అధ్యక్షుడు, నియోజకవర్గ బాధ్యులు పులివర్తి నాని ఆధ్వర్యంలో గురువారం చంద్రగిరి బస్టాండు ప్రాంతం వద్ద తెదేపా నాయకులు మానవహారంగా ఏర్పడి ఒంటి కాలిపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరావతిలో రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంత రైతులు 34 వేల ఎకరాలను స్వచ్ఛందంగా ఇచ్చారని గుర్తు చేశారు. గత 365 రోజులుగా రైతులు అలుపెరగని పోరాటం చేస్తున్నారని కొనియాడారు. వైకాపా నాయకులు భారీ స్థాయిలో విశాఖలో భూములను ఆక్రమించుకుని ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపించారు. అనంతరం ఉపతహసీల్దారు ప్రమీలకు వినతిపత్రం అందించారు. తెదేపా నాయకులు కుమారరాజారెడ్డి, గంగపల్లి భాస్కర్‌, ఈశ్వర్‌రెడ్డి, గౌస్‌బాషా, గిరిధర్‌రెడ్డి, సురేష్‌నాయుడు, ధనంజయరెడ్డి, బాలకృష్ణమూర్తి, రాకేష్‌చౌదరి, యశ్వంత్‌చౌదరి, భానుప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌కు అమరావతినే రాజధానిగా కొనసాగించాలని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి డిమాండు చేస్తూ.. అమడగూరులో గురువారం తెదేపా ఆధ్వర్యంలో బస్టాండు నుంచి రెవెన్యూ కార్యాలయం వరకు పల్లె రఘునాథరెడ్డి, నాయకులు ర్యాలీ చేపట్టారు.