ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యం: గాదె

గుంటూరు: ఓటు అనే ఆయుధంతో ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమౌతోందని జనసేన పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం జనసేన పార్టీ గుంటూరు నగర సంయుక్త కార్యదర్శి కొత్తకోట ప్రసాద్ ఆధ్వర్యంలో స్థానిక 32 డివిజన్ బ్రాడీపేట 1/18 నందు జరిగిన ఓటర్ నమోదు కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఈ సంధర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.జనసేనపార్టీ ఆధ్వర్యంలో వాడవాడలా ఓటరు నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ చైతన్యవంతులను చేస్తున్నామన్నారు. యువత ఈ అవకాశాన్ని వినియోగించుకొవాలని కోరారు. జనసేన నగర అధ్యక్షుడు నేరెళ్ళ సురేష్ మాట్లాడుతూ అధికార వైసీపీకి ఓటమి భయం పట్టుకోవడంతో తెలుగుదేశం, జనసేన పార్టీ సానుభూతిపరుల ఓట్లను అక్రమంగా తొలగిస్తూ రానున్న ఎన్నికల్లో అడ్డదారుల్లో గెలవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి ఓటర్ల జాబితాలో తమ పేర్లున్నాయో లేవో సరిచూసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు,జిల్లా ప్రధాన కార్యదర్శి నారా దాసు ప్రసాదు, చట్టాల త్రినాథ్, గుంటూరు నగరం డివిజన్ అధ్యక్షులు మధులాల్, చెన్నం శ్రీకాంత్, కదిరి సంజీవి, చింతకాయల శివ, 32 వార్డు డివిజన్ సభ్యులు చందు శీనువాసురావు, గడ్డం చిరంజీవి, బొడ్డుపల్లి రాధా కృష్ణ మూర్తి, నల్లిబోయిన అనిత. వీరవెంకటరావు, గబ్బిళ్ల గోవిందు, నూర్ బాషా ఆసియా, పవన్ వెంకీ తదితరులు పాల్గొన్నారు.