అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు రూపకల్పన చేస్తా: పాటంశెట్టి

జగ్గంపేట నియోజకవర్గం: జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశీస్సులతో జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 722వ రోజులో భాగంగా జగ్గంపేట మండలం రామవరం గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ జనసేన పార్టీని నియోజకవర్గంలో బలోపేతం చేస్తున్న ఇంచార్జ్ సూర్యచంద్ర. ఈ క్రమంలో గ్రామంలోని సగరపేట ప్రతి ఇంటికి తిరుగుతున్న తరుణంలో అక్కడ ప్రజలందరూ చెప్తున్న ఏకైక సమస్య మురుగునీటి సమస్య. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ఫ్రై డే డ్రై డే అని కార్యక్రమాలకు పేర్లు పెట్టడం కాదని వాటిని ఆచరణలో పెట్టీ చుపాంచాలని అన్నారు. జనావాసాల మధ్య ఇంత దారుణంగా మురుగు నీరు పేరుకుపోవడం వలన దోమలు ఎక్కువగా వ్యాప్తి చెంది తద్వారా రకరకాల జబ్బులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. అదేవిధంగా మంచినీటి కుళాయిలు యొక్క పైపు లైన్లు కూడా అదే డ్రైనేజీ మధ్యలోనుండి రావడం వలన పైపు లైనుకు ఏదైనా లీకేజీ ఉండడం వలన త్రాగు నీరు కూడా కలుషితం అయ్యి అనేక రకాల జబ్బులు వచ్చే అవకాశం కూడా ఉందని అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలిచిన తర్వాత అతి కొద్ది సమయంలోనే ప్రతి గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థకు రూపకల్పన చేసి ఎక్కడా కూడా మురుగు నీరు బయటకు కనిపించకుండా చేసి ప్రజల ఆరోగ్యాన్ని సంరక్షిస్తానని హామీ ఇచ్చారు.