పెద్దమాదిగపల్లిలో ఘనంగా శ్రీశ్రీశ్రీమాతమ్మ తిరుణాళ్ళు

అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని టి.సుండుపల్లి మండల పరిధిలో పెద్దమాదిగపల్లిలో వెలసిన శ్రీశ్రీశ్రీమాతమ్మ వారి రాత్రి తిరుణాల సందర్భంగా వివిధ రకాల సాంస్కృతి సంప్రదాయం ప్రకారం చాందనిబండ్లు, చెక్కభజనలు, డప్పువాయిద్యాలు, బాణసంచాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలానే అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరడం జరిగిందని రామ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, స్థానికులు, గ్రామస్థులు, యువకులు, భక్తులు, వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.