విశ్వేశ్వరాయపురం ముఖ్యనాయకులతో సమావేశమైన దేవ వరప్రసాద్

రాజోలు: మలికిపురం మండలం, విశ్వేశ్వరయపురం గ్రామ సర్పంచ్ చెల్లుబొయిన హెలినా హరికృష్ణ నివాసం వద్ద గ్రామ ముఖ్యనాయకులతో రాజోలు నియోజకవర్గ జనసేన, టీడిపి, బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్ధి దేవ వరప్రసాద్ సమావేశం అయ్యారు. గ్రామంలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నిసాధించుకుందాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపి జనసేన బీజేపీ రాష్ట్ర జిల్లా మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.