పనపాకంలో స్థానికులకు, స్ధానిక వైఎస్సార్సీపీ నాయకునికి అండగా దేవర మనోహర

  • సొంత పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయని వైయస్సార్సీపి నాయకులు ప్రజలకు ఏమి న్యాయం చేస్తారు??
  • పనపాకం ఇరిగిశెట్టి వారి పల్లె బాధితులకి న్యాయం జరిగేంత వరకు జనసేన పార్టీ అండగా ఉండి పోరాడుతుంది.

చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ ఆదేశానుసారం, తిరుపతి-చిత్తూర్ నేషనల్ హైవే లోని రోడ్డు విస్తరణలో బాగంగా చంద్రగిరి నియోజకవర్గంలోని చంద్రగిరి మండలం, పనపాకం పంచాయతీలోని ఇరిగిసెట్టీ వారి పల్లి లో స్థానిక వై.ఏస్. ఆర్.సీ.పీ నాయకులు హేమాద్రి మరియు 20 మంది స్థానికులు కలిసి వారికి ఎన్.హెచ్.ఎ.ఐ వారి వల్ల జగురుగుతున్న అన్యాయాలను మరియు వారికి నష్ట పరిహారం అందకుండా దౌర్జన్యంగా రోడ్డు పనులు ప్రారంభిస్తున్న తీరుని జనసేన జిల్లా నాయకులు దేవర మనోహర్ గారికి వివరించారు.

ప్రజల కష్టాలను వారి బాధను విన్న జనసేన నాయకులు దేవర మనోహర వెంటనే స్పందించి స్థానిక ప్రజలను కలిసి వివరాలు సేకరించారు. దాదాపు 20 మంది బాధితులు ఉంటే కేవలం ముగ్గురికి మాత్రమే బలవంతంగా నష్టపరిహారం ఇచ్చి, వారికి పునరావాసం కల్పించలేదు. మిగిలిన 17 మంది స్థానికులకు మరియు రైతులకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వకుండా వారి ఇళ్లను అక్రమంగా కూల్చుతున్నారు.

స్థానికులు అందరూ హైకోర్ట్ నీ ఆశ్రయించి కేసులు పెట్టినారు మరియు ఆ కేసులు కూడా పెండింగ్ లో ఉన్నా వాటికి అధికారులు పట్టించుకోకుండా పనులు చేస్తున్నారు.

బాధితుల పక్షాన నిలబడిన జనసేన నాయకులు దేవర మనోహర, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి స్థానిక ప్రజలతో కలిసి నేషనల్ హైవేలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. నిరసన కార్యక్రమంలో దేవర మనోహర మీడియాతో మాట్లాడుతూ.. తక్షణమే ప్రభుత్వ అధికారులు రీ సర్వే చేసి.. బాధితులకు కేంద్ర ప్రభుత్వం 2014 లోని భూసేకరణ చట్టాన్ని ఆధారంగా చేసుకొని ప్రస్తుత మార్కెట్ కి 4 రెట్లు నష్ట పరిహారాన్ని ఇచ్చి వారికి పునరావాసం కల్పించాలి అని డిమాండ్ చేశారు. వారికి నష్టపరిహారం ఇచ్చిన తరువాతే పనులు ప్రారంభించాలని, 24 గంటల లోపు ప్రభుత్వ అధికారులు స్పందించాలని లేని పక్షంలో లో రేపు తిరుపతి కలెక్టర్ ని బాదితులతో కలిసి సమస్య వివరించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మండల అధ్యక్షులు సంజీవి హరి, ఉపాధ్యక్షులు ఆశ, కిరణ్, జనసేన నాయకులు వాకా మురళి, రాజేష్, తరుణ్, ముత్యాలు మరియు జనసైనికులు మరియు వీరమహిలలు పాల్గొన్నారు.