ఈదరాడ గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

రాజోలు నియోజకవర్గం: మామిడికుడురు మండలం, ఈదరాడ గ్రామంలోని హైస్కూల్ మరియు పంచాయితీ నందు మంగళవారం 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా హైస్కూల్ ఆవరణలో ఉపాధ్యాయులు, నాయకులు మరియు విద్యార్థుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ చేసి అందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియ పరిచి ఉత్తమ విద్యార్థులకు బహుమతులు అందజేచినారు. తరువాత పంచాయితీ దగ్గర ఈదరాడ సర్పంచ్ మరియు వార్డు మెంబెర్స్ పంచాయితీ ఉద్యోగులు, సచివాలయాం ఉద్యోగులు మరియి రాజకీయ నాయకుల ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జరిగినది.