ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జనసేనతోనే సాధ్యం: బాడిశ మురళీకృష్ణ

జగ్గయ్యపేట, వత్సవాయి గ్రామంలోని జనసేన పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బాడిశ మురళీకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి జనసేన పార్టీ తోనే సాధ్యమవుతుందని వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ఎటువంటి అభివృద్ధి లేకపోగా యాభై సంవత్సరాలు వెనక్కి రాష్ట్రం నెట్టివేయబడిందని అన్నారు. రాష్ట్రానికి రాజధాని ఏంటో కూడా తెలియని అయోమయ స్థితిలోకి ప్రజలని నెట్టివేశారని ప్రతి ఏటా జాబ్ క్యాలెండరుని విడుదల చేసి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తామని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగులను నిండా ముంచారాని రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేశారని రాష్ట్ర ప్రజలు ప్రత్యామ్నాయంగా జనసేన వైపే చూస్తున్నారని రాష్ట్ర అభివృద్ధి జనసేన పార్టీతోనే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు రేగండ్ల వెంకటరామయ్య ఉపాధ్యక్షులు రామకోటేశ్వరరావు, శైలజ, మీరా, మాణిక్యాలరావు తదితరులు పాల్గొన్నారు.