పాటంశెట్టిని కలిసి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న దేవిపట్నం జనసేన

జగ్గంపేట, గోకవరం మండలం అచ్చుతాపురం గ్రామంలో గ్రామస్తులు మనోభావాలకు వ్యతిరేకంగా ఊరి మధ్యలో వేస్తున్న 33 కెవి విద్యుత్ వైర్లు ఊరి ప్రజలు ప్రశ్నిస్తే వారి మీద బెదిరించడం కూడా జరిగింది. ఆఖరికి జగ్గంపేట ఇంచార్జ్ పాటంశెట్టి సూర్యచంద్రరావు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రజలకు న్యాయం చేశారు. నాలుగు రోజుల దీక్ష తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం దిగివచ్చి 33 కెవి హై టెన్షన్ వైర్లను ఊరి మధ్య నుండి కాకుండా అతి దగ్గర దూరంలో ఉన్న పొలాల మధ్యనుండి వేయడానికి నిర్ణయించుకుంది. ఇలా చేయడం వల్ల మూడు కోట్ల రూపాయలతో ఆ విద్యుత్ వైర్లు పని పూర్తి అవుతుంది. అలా కాకుండా మూడు కిలోమీటర్ల దూరం గ్రామం మద్య నుండి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు కాంట్రాక్టర్… వైసిపి ప్రభుత్వంలో జరిగిన ఈ తప్పిదాన్ని సరిచేసి ప్రజల ప్రాణాలనే కాదు ప్రభుత్వానికి 10 కోట్ల రూపాయలు మిగిల్చిన పాటంశెట్టి సూర్యచంద్రరావు కలిసి ఆరోగ్యం పరిస్థితిని కనుక్కోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ దేవిపట్నం మండల కన్వీనర్ రాయుడు, సందీప్, మహేష్, రమేష్, వంశీ తదితరులు పాల్గొనడం జరిగింది.